Posts

రేపు పిఠాపురం లో పవన్ రోడ్ షో

Image

రేపు పిఠాపురం లో పవన్ రోడ్ షో కి అనుమతులు ఇచ్చిన అధికారులు .. ఉమ్మడి కూటమి నేతలు పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో నియోజవర్గం మొత్తం కవర్ అయ్యే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు ..మరికాసేపట్లో రూట్ మ్యాప్ రానున్నది

ఆ గొంతుకు చట్ట సభలో వినిపించాలి - చిరంజీవి

Image

అమ్మ కడుపులో ఆఖరికి పుట్టినా.. జనానికి మంచి చేయడంలో ముందుంటాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలంటే, ఆ గొంతు చట్టసభల్లో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనాని గెలిపించాలి' అని చిరంజీవి గారు పిలుపునిచ్చారు.

జనసేన శ్రేణులు తస్మాత్రా జాగ్రత !

Image

ఎన్నికల వేడి మరింత వేడి ఎక్కనుంది .. పిఠాపురం లో పవన్ గెలుపు ఖాయం గా కనిపిస్తున్న నేపథ్యంలో మరో వారం రోజుల్లో ఎలక్షన్స్ జరగనున్న నేథ్యంలో ప్రత్యర్థి పార్టీ కవింపు చేష్టలకి పలుపడే అవకాశం ఉన్నట్లు సమాచారం దానికి .. రానున్న రోజుల్లో తోపులాటలు జరిగే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం .. జనసేన శ్రేణులు గొడవలకు , వివాదాలకు దూరంగా ఉండవలసింది గా మనవి ..కవ్వింపు చర్యలకు రియాక్ట్ అవ్వదు పార్టీ లీగల్ టీం చూసుకుంటది. ఓటు అనే ఆయధంతో మనం జవాబు ఇదేం . తస్మాత్ జాగ్రత్త .

జనసేన ప్రచారం లో కొండేవరం యువత

Image

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నాల్గవ నెంబర్ గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ఉమ్మడి మేనిఫెస్టో నీ ప్రజలకు వివరిస్తూ కొండేవరం గ్రామ యువత గ్రామంలోని గొల్లపేటలో ఇంటింటా డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు . ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ గారి నీ అత్యధిక మెజారిటీ తో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.

కొండేవరం లో జనసేన పార్టీ తరుపున మజ్జిగ పంపిణీ

Image

కొండేవరం గ్రామంలో జనసేన పార్టీ తరుపున మజ్జిగ పంపిన చేసిన జనసేన కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్త గాది రాజా పుట్టిన రోజు సందర్భగా మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు .

Video: ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు

Image

ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు శ్రీమతి క్రాంతి గారు. కేలవం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ముద్రగడని జగన్ వాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తన వంతు కృషి తను చేస్తానని తెలిపారు.. క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి https://www.facebook.com/share/v/SX6BPHCAN69RBEdp/?mibextid=oFDknk

మరికాసేపట్లో కొండేవరం నుంచి వైష్ణవ్ తేజ్ ప్రచారం

Image

ఈరోజు పిఠాపురం నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ గారి తరుపున మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ ప్రచారం చేయనున్నారు ... వైష్ణవ్ తేజ్ ప్రచారం కొండేవరం గ్రామంలో 4 గంటలకు మొదలవుతుందని .. కొండేవరం నుంచి ఉప్పాడ వరకు ఈ పర్యటన జరగనుంది .. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సుధీర్ తో పాటు గెటప్ శ్రీను పాల్గొంటున్నట్లు సమాచారం .. జనసేన కూటమి నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది గా మనవి ..

ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ కోటి రూపాయిలు విరాళం

Image

పోలవరం నిర్వహితులకు 33 వేల కోట్ల అవసరం . మీరు నాకు ఇచ్చిన ప్రజా అభిమానానికి నా వంతుగా నా కష్ట జీవితం కోటి రూపాయిలు ప్రభుత్వం ట్రెజ్జరికి ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వారాహి సభలో ప్రకటించారు

రేపు పిఠాపురం లో వైష్ణవ తేజ్ పర్యటన

Image

అందరికి నమస్కారం *రేపు (01-05-2024) పిఠాపురంలో శ్రీ వైష్ణవ తేజ్ గారి ప్రచారం* *పర్యటన వివరాలు:* మధ్యానం 3.00 గంటలకు నవ కొండేవారం లో ప్రారంభమై చింత చెట్టు సెంటర్ - 3:15pm, జొన్నల చెరువు - 3:30pm, కొత్త ఇసుకపల్లి - 3:45pm, పాత ఇసుకపల్లి సెంటర్ - 4:00pm, తోటూరు సెంటర్ - 4:15pm, నాగులపల్లి - 4:45pm, రమణక్కపేట - 5:15pm, రావివరపాడు - 5:45pm, ముమ్మివరోడు - 6:00pm, శ్రీ రామ పురం - 6:15pm, మల్లివారితోట - 6:45pm, కొన్నప్ప పేట - 7:00pm, మూలపేట, రామన్నపాలెం సెంటర్ - 7:15, అమినబాధ్ - 7:45pm, ఎండ్లపల్లి - 8:15pm, కొత్తపల్లి - 8:45 pm, ఉప్పాడ - 9:15pm వరకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు , వీర మహిళలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రార్థన జనసేన పార్టీ కార్యాలయం పిఠాపురం నియోజకవర్గం.

జనసేన కూటమి మేనిఫెస్టో

Image

2024 సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో నీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి విడుదల చేశారు కూటమి మ్యానిఫెస్టో వివరాలు 1.మెగా డీఎస్సీపై తొలి సంతకం 2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000 3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000 4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం 6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు 7.రూ.3000 నిరుద్యోగ భృతి 8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000 9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ 10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి 11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000 12.ఉచిత ఇసుక 13.అన్నా క్యాంటీన్లు 14.భూ హక్కు చట్టం రద్దు 15.ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ 16.బీసీ రక్షణ చట్టం 17.పూర్ టూ రిచ్ పథకం 18.చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500యూనిట్ల విద్యుత్ ఫ్రీ 19.కరెంటు చార్జీలు పెంచం 20.బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ 21.పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం 22.పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం 23.పెళ్లి కానుక రూ.1,00,000/- 24.విదేశీ విద్య పథకం 25.పండుగ కానుకలు

మనం నాలుగో నెంబర్ పై ఓటు వేయాలి

Image

పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి Evm లో నాలుగో నెంబర్ కేటాయించడింది కావున నాలుగో నెంబర్ గాజు గ్లాస్ గుర్తు పై మనం ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించుకోవాలని .. జనసేన పిఠాపురం అభ్యర్థి : కొణిదెల పవన్ కళ్యాణ్ EVM బ్యాలెట్ నెంబర్ : 04 Note: మన యాప్ అప్డేట్ వెర్షన్ వాడుతున్నారో లేదో కింద ఉన్న లింక్ ద్వారా తెలుసుకుని అప్డేట్ చేసుకోవడం ద్వారా పిఠాపురం జనసేన లేటెస్ట్ న్యూస్ వెంటనే తెలుసుకోవచ్చు 👇.. https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp We are official on play Store

Live: పిఠాపురం లో పవన్ కళ్యాణ్ రోడ్ షో

Image

కింద ఉన్న లింక్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం మండలంలో నిర్వహిస్తున్న రోడ్ షో లైవ్ లో చూడండి 👇 https://www.youtube.com/live/dnfUHyrJ0cs?si=5r_J-FNbWJaogjxJ Note: మన యాప్ అప్డేట్ వెర్షన్ వాడుతున్నారో లేదో కింద ఉన్న లింక్ ద్వారా తెలుసుకుని అప్డేట్ చేసుకోవడం ద్వారా పిఠాపురం జనసేన లేటెస్ట్ న్యూస్ వెంటనే తెలుసుకోవచ్చు 👇.. https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp We are official on play Store

ఈరోజు జరిగే పవన్ కళ్యాణ్ రోడ్ షో వివరాలు

Image

పిఠాపురం మండలం లో జరిగే పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో వివరాలు పక్కన ఉన్న షెడ్యూల్ ట్యాబ్ లో చూడవచ్చు Note: మన యాప్ అప్డేట్ వెర్షన్ వాడుతున్నారో లేదో కింద ఉన్న లింక్ ద్వారా తెలుసుకుని అప్డేట్ చేసుకోవడం ద్వారా పిఠాపురం జనసేన లేటెస్ట్ న్యూస్ వెంటనే తెలుసుకోవచ్చు 👇.. https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp We are official on play Store

మరి కాసేపట్లో ప్రత్తిపాడు లో పవన్ ప్రసంగం

Image

ఎన్నికలు ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం 5 గంటలకు పాల్గొనున్నారు 📍 5 pm: ప్రత్తిపాడు నియోజకవర్గం: బాలాజీ చౌక్, ఏలేశ్వరం 📍7 pm: జగ్గంపేట నియోజకవర్గం: టిటిడి కళ్యాణ మండపం దగ్గర, కిర్లంపూడి Note: మన యాప్ అప్డేట్ వెర్షన్ వాడుతున్నారో లేదో కింద ఉన్న లింక్ ద్వారా తెలుసుకుని అప్డేట్ చేసుకోవడం ద్వారా పిఠాపురం జనసేన లేటెస్ట్ న్యూస్ వెంటనే తెలుసుకోవచ్చు 👇.. https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp We are official on play Store

రెప్పటి పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన వివరాలు

Image

29-4-24 పవన్ కళ్యాణ్ గారు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేయనున్నారు CHENDURTHI JN 8:00 AM VANNEPUDI & KODAVALI 8:30 AM VELDHURTHI & DONTAMURU 9:00 AM B.KOTHURU & P.TIMMAPURAM 9:30 AM GOKIVADA 09:45 AM JAMULAPALLI 10:00 AM NARASINGAPURAM 10:15 AM L.N.PURAM & KOLANKA 10:30 AM VIRAWADA 10:45 AM VIRAVA & MANGITURTHI 11:15 AM MALLAM 11:45 PM JALLURU 12:15 PM F.K.PALEM & KANDRADA 12:30 PM KUMARAPURAM 01:00 PM Note: మన యాప్ అప్డేట్ వెర్షన్ వాడుతున్నారో లేదో కింద ఉన్న లింక్ ద్వారా తెలుసుకుని అప్డేట్ చేసుకోవడం ద్వారా పిఠాపురం జనసేన లేటెస్ట్ న్యూస్ వెంటనే తెలుసుకోవచ్చు 👇.. https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp We are official on play Store

వర్మ పై వైఎస్ఆర్సీపీ దృశప్రచరం

Image

పిఠాపురం నియోజకవర్గం లో జనసేన బలపడుతున్న నేపథ్యంలో వర్మ పై వైఎస్ఆర్సీపీ అఫిషియల్ సోషల్ మీడియా హేండిల్స్ దృశప్రచారనికి తెరలేపాయి .. వర్మ నీ పవన్ నమ్మలేక పక్కన పెట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు .. తమ అనుకులా మీడియా ద్వారా వర్మ త్వరలో వైఎస్ఆర్సీపీ లో జాయిన్ అవుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు .. ఇటువంటి వార్తలో నిజం లేదని ఓటమి భయం తో ఫేక్ ప్రచారం చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలియజేశాయి .. Note: మన యాప్ అప్డేట్ వెర్షన్ వాడుతున్నారో లేదో కింద ఉన్న లింక్ ద్వారా తెలుసుకుని అప్డేట్ చేసుకోవడం ద్వారా పిఠాపురం జనసేన లేటెస్ట్ న్యూస్ వెంటనే తెలుసుకోవచ్చు 👇.. https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp We are official on play Store

డొక్కు స్కూటర్ లో తిరిగిన కన్నబాబు - పవన్ కళ్యాణ్

Image

డొక్కు స్కూటర్ లో తిరిగిన కన్నబాబు. చిరంజీవి గారి పెట్టిన్ భిక్ష తో ఎమ్మెల్యే అయ్యాడు . అలాంటి చిరజీవి గారిని జగన్ మీటింగ్ పేరుతో పిలిచి దణ్ణం పెట్టించి వీడియో తీసుకుంటుంటే ఈ కన్నబాబు కి కోపం రాలేదా ,పౌరుషం రాలేదా .. సిగులేకుండా ఇంక అలాంటి జగన్ లాంటి వ్యక్తులు తీసుకువచ్చి కాకినాడ లో మీటింగ్ పెట్టిస్తారా అని కాకినాడ రూరల్ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు

Live పవన్: కళ్యాణ్ గారి ప్రసంగం

Image

ఎన్నికలు ప్రచారం లో భాగంగా కాకినాడ రూరల్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని కింద ఉన్న లింక్ ద్వారా లైవ్ లో చూడండి https://www.youtube.com/live/8R9B75EZu8c?si=R46M9T4c-D2qthjw

కాకినాడలో పవన్ సింపుల్ సిటి

Image

జనసేన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమం లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ . కాకినాడ లో చాలా సింపుల్ సిటి గా కనిపించారు .. బైక్ మీద కూర్చుని కార్యకర్తలకు అభివాదం చేస్తూ ... కార్యకర్తల చేస్తున్న నినాదలకు రీప్లేస్ ఇస్తూ చపట్లు కొడుతూ తన ఆనందాన్ని పంచుకోవడం కార్యకర్తలను ఎంతగానో ఆకట్టుకున్నాది ..

పవన్ కళ్యాణ్ గారి అయిదేళ్ళ సంపాదన రూ.114.76 కోట్లు

Image

• ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు • అందచేసిన విరాళాలు రూ.20 కోట్లు • అప్పులు రూ.64.26 కోట్లు జనసిన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంలో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. గత అయిదేళ్ళలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సంపాదన రూ.114.76,78,300 కోట్లు. ఇందుకు సంబంధించి ఆదాయ పన్నుగా రూ.47,07,32,875 కోట్లు, జీఎస్టీకి 28,84,70,000 శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అప్పులు రూ.64,26,84,453 కోట్లు ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 కోట్లు, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46,70,000 ఉన్నాయి. • విరాళాలు రూ.20 కోట్లుపైనే శ్రీ పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసిన పార్టీ చేపట్టి సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు రూ.3,32,11,717 కోట్లు విరాళాలు అందచేశారు. ఆ వివరాలివి.. కేంద్రీయ సైనిక్ బోర్డు - రూ.1 కోటి పి.ఎం. సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్- రూ.1 కోటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి- రూ.50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి - రూ.50 లక్షలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ - రూ.30,11,717 పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ రూ.2 లక్షలు

నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్

Image

పిఠాపురం లో నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ గారు.. జనసేన కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీ మధ్య పవన్ కళ్యాణ్ గారు గొల్లప్రోలు నుంచి పిఠాపురం పాదగయ వరకు ర్యాలీలో పాల్గొన్ని ఎంపిడిఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు .. ర్యాలీలో ఎటు చూసినా జనం .. ఒక వైపు పవన్ కళ్యాణ్ గారు జాతీయ జెండా తో రోడ్ల కు ఇరువైపులా ఎర్ర కండువా తో పాటు జనసేన జండాలు తో కార్యకర్తలు అభిమానం మధ్య విజయోత్సవ ర్యాలీ గా జరగింది.

నామినేషన్ కి బయలుదేరిన జనసేనని.

Image

నామినేషన్ కి చేబ్రోలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన జనసేనని.

పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ర్యాలీ రూట్ మ్యాప్

Image

ఈరోజు జరగబోయే పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ ర్యాలీ రూట్ మ్యాప్ ర్యాలీ ప్రారంభ స్థలం 1)గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ (హైవే) 2)గొల్లప్రోలు MRO office 3)సూరీడు చెరువు (బస్టాండ్) 4)పిఠాపురం దూళ్ళ సంత 5)చర్చ్ సెంటర్ 6)పిఠాపురం బస్టాండ్ 6)ఉప్పాడ బస్టాండ్ 7)గవర్నమెంట్ హాస్పిటల్ 8)పోలీస్ స్టేషన్ రోడ్ 9)ర్యాలీ ముగింపు స్థలం పాద గయ క్షేత్రం MPDO ఆఫీసు

రేపు పిఠాపురం లో జన జాతరే

Image

పవన్ కళ్యాణ్ గారు రేపు పిఠాపురం లో నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో జన జాతరే .. రోడ్లని కార్యకర్తలతో నిండిపోనున్నాయి .. భుజం పై ఎర్ర టవల్స్ తో తమ అభిమాన నాయకుడు వెంట కార్యకర్తలు నడవనున్నారు .. నాయకత్వం తో పని లేకుండా తమ నాయకుడిని అసెంబ్లీ కి పంపే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకున్నారు .. నిన్నటి వరకు ఊరు ఊరు ప్రచారం చూశాము .. రేపు జాతర చూడబోతున్నమూ .. వీర మహిళల హారతులు మధ్య యువ కెరటాలు కేరింతలు మధ్య అధినాయకుడు నామినేషన్ పర్వం ఒక పండగలగా సాగనుంది .. ఈ ప్రయాణం లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొన్ని రాబోవు కాలంలో జరిగే మార్పులో , పేదవాడి కలలో కలిగే ఆనందం లో మనం కూడా భాగ్యస్వాములవుదాం .. జై జనసేన జై పవన్ కళ్యాణ్ ✊✊

పిఠాపురం జనసేన ముఖ్య సమాచారం

Image

ముఖ్యమైన సమాచారం: రేపు అనగా ది 23/04/2024 మంగళవారం ఉదయం 9 గంటలకు, గొల్లప్రోలు టౌన్ ప్రారంభ సెంటర్ నుండి ప్రారంభమై... గొల్లప్రోలు టౌన్ మీదుగా... పిఠాపురం టౌన్ ని కలుపుకుంటూ... పాదగయ్య వద్దకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ (bike)ర్యాలీ జరుగుతుంది. ఈ బైక్ ర్యాలీలో పాల్గొనేవారు తమ పేరు ఫోన్ నెంబరు మరియు బండి నెంబర్ ల యొక్క వివరాలు మీ సంబంధిత గ్రామ లేదా మండల నాయకులకు పెట్టగలరు..!! ఈ ర్యాలీలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నామినేషన్ ర్యాలీని "నభూతో నభవిష్యతి" అన్న విధంగా విజయవంతం చేయాలని ప్రార్థన. జనసేన పార్టీ కార్యాలయం పిఠాపురం నియోజకవర్గం.

మరికాసేపట్లో యండపల్లి గ్రామంలో నాగబాబు గారు పర్యటన

Image

ఈ రోజు సాయంత్రం 6:00 గంటలకు యండపల్లి గ్రామంలో జనసేన పార్టీ సెక్రెటరీ నాగబాబు గారు మాజీ ఎంఎల్ఏ వర్మ గారు తో ప్రోగ్రాం జరుగును కావున అందుబాటులో ఉన్న జనసేన తెలుగుదేశం బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలి అని కోరుకుంటున్నాము

సమష్టి పోటీ.. ఐకమత్య పోరు... ఉమ్మడి విజయమే లక్ష్యం

Image

175 నియోజకవర్గాల్లో మూడు పార్టీలు పోటీ చేసినట్లు భావించాలి మూడు పార్టీల కలివిడితనం పోలింగ్ బూతుల్లోనూ కనిపించాలి జనసేన రిస్క్ తీసుకొని మరీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది శ్రీ చంద్రబాబు గారి లాంటి నాయకుడిని కావాలని వేధించిన వైసీపీ ప్రభుత్వం నా వంతుగా ఆయనకు కీలక సమయంలో అండగా నిలిచాను పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

శ్రీ పవన్ కళ్యాణ్ గారి 20-04-2024, (శనివారం) షెడ్యూల్

Image

• 12 PM : పిఠాపురం నియోజక వర్గం టీడీపీ కార్యకర్తలతో సమావేశం, సురక్ష ప్యాలస్ ఫంక్షన్ హాల్, యు. కొత్తపల్లి • 5 PM : రాజానగరం నియోజక వర్గం, కోరుకొండలో వారాహి విజయ భేరి సభ. (కోరుకొండ బస్టాండ్ సెంటర్ వద్ద)

మే 11 వరకు పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్

Image

20-04-2024 TDP Internal Meeting, Pithapuram. Rajanagaram Public Meeting 21-04-2024 Bhimavaram, Narasapuram 22-04-2024 Tadepallegudem, Ungutur 23-04-2024 Nomination, Pithapuram. Public Meeting at Uppada 24-04-2024 TDP/Rajampeta, Railway Kodur Public Meetings with CBN 25-04-2024 TDP 26-04-2024 Razole, Ramachandrapuram 27-04-2024 Peddapuram, Kakinada Rural 28-04-2024 Jaggampeta, Prathipadu 29-04-2024 Tirupati 30-04-2024 Polavaram 01-05-2024 Elamanchili, Pendurthi 02-05-2024 Visakhapatnam South 03-05-2024 Palakonda, Nellimarla 04-05-2024 Tuni, Pithapuram 05-05-2024 Gudivada, Pamarru 06-05-2024 Repalle, Avanigadda 07-05-2024 Gannavaram, Penamaluru 08-05-2024 Meetings to be finalised 09-05-2024 Meetings to be finalised 10-05-2024 Pithapuram Road Show & Meeting 11-05-2024 Kakinada Urban Road Show & Meeting

23వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నామినేషన్

Image

పిఠాపురం శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేయనున్నారు. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు.

ఎలక్షన్స్ లో పాల్గొంటున్న అభ్యర్థులు పాటించవలసిన నిబంధనలు

Image

◻️ అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి ◻️ రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి || నామినేషన్ల స్వీకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలు || 1)అభ్యర్థులు నామినేషన్ల దాఖల కు 13 రకాల డాక్యుమెంట్లను తీసుకురావాలని, అన్ని రకాల డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే నామినేషన్లను అనుమతించడం జరుగుతుంది. 2)పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం-2ఏ, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం-2బి సమర్పించాలి. 3)నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుంది 4) పబ్లిక్ సెలవు దినాలలో నామినేషన్ స్వీకరించ బడదు. 5) అభ్యర్థులు గరిష్టంగా 4 సెట్ల నామినేషన్ దాఖలు చేయవచ్చు. 6) 2 కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదు. 7) నామినేషన్ల దాఖలు సమయంలో 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా 3 వాహనాలు అనుమతించ బడతాయి, అలానే 5 మంది వ్యక్తులు (అభ్యర్థితో సహా) ఆర్ఓ ఆఫీస్‌లోకి ప్రవేశించవచ్చు. 8) నామినేషన్ల స్వీకరణకు సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తారు. 9)అభ్యర్థి నామినేషన్ వేసిన దగ్గర నుంచీ, ఖర్చు అతని ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. 10) పత్రికల్లో వచ్చే ప్రకటనలు, పెయిడ్ న్యూస్ వార్తలను అభ్యర్థి ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. 11) ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గానికి 40 లక్షల ఖర్చు పరిమితి, అలానే పార్లమెంట్ అభ్యర్థికి 95 లక్షల రూపాయల ఖర్చు పరిమితం..

రాపర్తి గ్రామంలో ఇంటీంటి ప్రచారం

Image

ఈరొజు పీఠాపురం నియోజకవర్గం రాపర్తి గ్రామంలో ఇంటీంటి ప్రచారంలో భాగంగా రాష్ట్రస్థాయి నాయకులు DK చైతన్య ఆదికేశవులు గారు,కడలి ఈశ్వరి గారు,విశాలి కాట్నం గారు, వెన్నా జగదీష్ గారు,సందీప్ గారు,బండి ఏసుబాబు గారు,రాపర్తి జనసేన నాయకులు వీరంరెడ్డి అమర్,కీర్తి చంటి, దువ్వ వీరబాబు,నారాయణ రెడ్డి,మేకా రాజా, కోన గనిరాజు,సూర్నీడీ సాయి,దువ్వ శివ, దువ్వ గంగ,యాతాం రాజు ,అంశాల రాజు,దేశనీడి సుధీర్, ముమ్మిడి స్వామి, బొమ్మిడాల స్వామి, జనసైనీకులు, TDP,BJP నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది

ఈ రోజే భి ఫారంలు అందజేయనున్నా పవన్ కళ్యాణ్ గారు

Image

ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో భి ఫారంలు అందజేయనున్నారు. వీడియో లింక్ https://www.youtube.com/live/LpVfwF1dgJQ?si=owgsykPp4v8NQbrA

పిఠాపురం రానున్న పవన్ కళ్యాణ్

Image

ఈనెల ఏప్రియల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 25 తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసే అవకాశం వున్న నేపథ్యం లో పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 22 పిఠాపురం లో నామినేషన్ వేయనున్నట్లు జనసేన పార్టీ నుంచి అంతర్గత సమాచారం

మన JSPPTP యాప్ నుంచి కొత్త అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది

Image

మన JspPtp నుంచి కొత్త అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది ..న్యూస్ ఫీడ్ మరింత వేగంగా లోడ్ అయ్యేవిధంగా .. ఇప్పుడే Google play Store నుంచి యాప్ నీ అప్డేట్ చేసుకోండి కింద ఉన్న లింక్ క్లిక్ చేసి 👇 https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp

కొండేవరం లో జనసేన డోర్ తో డోర్ ప్రచారం

Image

ఈరోజు కొండేవరంలో గ్రామ జనసేన నాయకులు,కార్యకర్తలు జనసేన తరుపున డోర్ తో డోర్ ప్రచారం చేశారు .. అవినీతికి తావు లేని నాయకుడు, అధికారం లేకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యం లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు .. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ,కార్యకర్తలు గాది కొండబాబు,తోట ప్రసాద్ , గాది గోపి ,గింజల మహాలక్ష్మి,వేమగిరి నాని,తోలెం గుర్రయ్య,ఎండ్ర నాగు ,మేడిశెట్టి వెంకటేష్,మేడిశెట్టి రాజేష్,పుల్ల కొండబాబు,మేడిశెట్టి హ్యాపీ,కందా రాంబాబు తో పాటు రాష్ట్ర మరియు ఇతర ప్రాంతాల నాయకులు మర్రిరెడ్డి శ్రీనివాస్ ఎలక్షన్ ఇన్చార్జి , శంకర్ గౌడ్ , కర్ణ మురళీకృష్ణ నాయుడు , గంటా స్వరూప , ప్రియాశౌజన్య , సుంకర కృష్ణవేణి , తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మత్సా అప్పాజీ పాల్గొన్నారు. మా ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికీ కొండేవరం జనసేన పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

పిఠాపురం నేతన్నల ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారు

Image

పిఠాపురం నియోజకవర్గంలో చేనేత కార్మికులు పడుతున్న సమస్యల పట్ల జనసేన ఆర్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అవగాహన ఉన్నదని, నేతన్నల ఆశయాలు నెరవేర్చడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రణాళికతో ఉన్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. నేతన్నల కోసం మాత్రమే కాకుండా పిఠాపురం శాసనసభ్యులుగా పిఠాపురం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారని వెల్లడించారు. డీ.కే. చైతన్య ఆది కేశవులు గారి నేతృత్వంలో మంగళవారం పిఠాపురంలో జరిగిన పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ, యూ కొత్తపల్లి మండలాల చేనేత సంఘాల ఆత్మీయ సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. ఇటీవల తమను కలిసిన వీవర్స్ ఫెడరేషన్ సభ్యులు తమతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న స్థితిగతులు చూస్తుంటే 2019కు ముందు ఉన్న పరిస్థితి చాలా ఉత్తమం అనిపిస్తోందని, అలాంటి పరిస్థితులు మళ్ళీ రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారని అన్నారు. అగ్గి పెట్టెలో పట్టే అంత చీరను తయారు చేసి దేశ అధ్యక్షులకు కానుక ఇచ్చిన ఘనత సాధించిన చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి బాధాకరమని అన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పారు. ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయలు కార్మికుల శ్రమను వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని చెప్పారు. చేనేత వస్త్రాల తయారీ ద్వారా రావాల్సిన సబ్సిడీ కూడా నేతన్నల దక్కట్లేదని, ప్రభుత్వమే దళారీ వ్యవస్థను పంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని శ్రీ నాగబాబు గారు ప్రకటించారు.

గొల్లప్రోలు లో నాగబాబు గారి రోడ్ షో

Image

17-04-2024 బుధవారం గొల్లప్రోలు పట్టణం లో సాయంత్రం 4 నుండి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు గారు రోడ్ షో చేయనున్నారు. ప్రతి వీధి లో రోడ్ షో చేస్తూ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేయనున్నారు. కావున ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు కార్యకర్తలు వీరమహిళలు మరియు పిఠాపురం ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు "జనసేన పార్టీ కార్యాలయం"

మన ఎన్నికల గుర్తులో ఎటువంటి మార్పు లేదు

Image

జనసేన పార్టీ ఎన్నికలు గుర్తు గాజు గ్లాస్ కానీ ఈ గుర్తు కోసం మేము మొదటి దరఖాస్తు చేసుకున్నామని మాకు కేటాయించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టు లో వేసిన పిటిషయన్ కోర్ట్ కొట్టివేసింది .. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు

లీగల్ టీం పిఠాపురం జనసేన పార్టీ

Image

జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ మనవి పిఠాపురంలో ఈ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు వచ్చినా, బెదిరించిన, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్న పోలీసులు గాని అధికారులు గానీ ఎలక్షన్ కోడ్ అని ఎవరు అయిన మిమ్మల్ని ఏ రకంగా అయినా ఇబ్బంది పెడితే ఈ ఎలక్షన్ అయ్యేంతవరకు ఒక లీగల్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా 18 మంది న్యాయవాదుల్ని మరియు 2 బ్యాక్ అండ్ టీం ని ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఏదైనా సమస్య ఎదురవుతే టీం వారికి ఎవరికైనా కాల్ చేసి సమస్యను తెలియజేయండి .

ప్రచారం లో జోరు పెంచిన వీర మహిళలు

Image

జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి గంటా స్వరూప , చల్లా లక్ష్మి, ప్రియ సౌజన్య, కట్నాం విశాలి లక్ష్మి, కడలి ఈశ్వరి , శిరీష తోలేటి, పిల్లా జ్యోతి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం లో ప్రచారం జోరు పెంచారు .. మండుటెండలు సైతం లెక్క చేయకుండా ప్రతి రోజూ నియోజకవర్గంలో ఏదోక ఊరిలో ఇంటికి ఇంటికి ప్రచారం చేస్తూ మహిళలకి బొట్టు పెడుతూ పవన్ కళ్యాణ్ గారి కి ఓటు వేయమని కోరుతున్నారు .. ఎటువంటి అధికారం లేకుండా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులను ఆదుకున్నారు . ఎందరికో సేవ చేశారు .. ఒక అవకాశం ఇస్తే పిఠాపురం నీ దేశంలోనే రోల్డ్ మోడల్ నియోజకవర్గం గా చేస్తారని దేశం మొత్తం పిఠాపురం వైపు చూసే లాగా చేస్తారని తెలియజేస్తున్నారు

శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే.. జగన్ కూ - పవన్ కళ్యాణ్

Image

శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే.. జగన్ కూ • జగన్ కు అధికార గర్వం తలకెక్కింది, అందరినీ తన బానిసలుగా భావిస్తున్నాడు • అధికార గర్వం ఉన్న వారిని ప్రజలు వెంటపడి తరుముతారు • తాడేపల్లి ప్యాలెస్లోకి కూడా జనం చొచ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది • పొత్తు గెలువాలి - జగన్ రెడ్డి పోవాలి #Tenali #VarahiVijayaBheri

తెనాలి సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో కూడిన మాటలు

Image

జగన్ పై రాయి పడితే రాష్ట్రానికి గాయం అయింది అంటున్నారు . మరి వీళ్ల సంగతి ఏమిటి జగన్ స్కూల్ కి వెళ్ళే సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని హత్య చేసి ఆత్మహత్య అంటే ఎవరు పట్టించుకోరు .. తన అక్క వెంట పడవద్దని చెప్పిన అమర్నాథ్ నీ అరటి తోటలో కాల్చి చంపిన వాళ్ల సంగతి ఏమిటి జగన్ .. 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకపోతే రాష్ట్రానికి గాయం కలేదా జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు వీడియో లింక్ https://www.facebook.com/share/r/9aERMKaw1Cqi3GVm/?mibextid=D5vuiz

తెనాలి సభలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదనతో కూడిన మాటలు

Image

జగన్ పై రాయి పడితే రాష్ట్రానికి గాయం అయింది అంటున్నారు . మరి వీళ్ల సంగతి ఏమిటి జగన్ స్కూల్ కి వెళ్ళే సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని హత్య చేసి ఆత్మహత్య అంటే ఎవరు పట్టించుకోరు .. తన అక్క వెంట పడవద్దని చెప్పిన అమర్నాథ్ నీ అరటి తోటలో కాల్చి చంపిన వాళ్ల సంగతి ఏమిటి జగన్ .. 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకపోతే రాష్ట్రానికి గాయం కలేదా జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు వీడియో లింక్ https://www.facebook.com/share/r/9aERMKaw1Cqi3GVm/?mibextid=D5vuiz

శ్రీ చిరంజీవి గారి ప్రోత్సాహంతో జనసేన బలం రెట్టింపయింది- నాగబాబు

Image

మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో శ్రీ కె. నాగబాబు గారు ఎవరెస్ట్ శిఖరం లాంటి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల ప్రోత్సాహం అందించడం చాలా సంతోషకరమైన అంశమని, ఇంతవరకు శ్రీ చిరంజీవి గారి మద్దతు జనసేనకు లేదనే వాళ్ళ నోర్లు ఇప్పుడు మూత పడ్డాయని, శ్రీ చిరంజీవి గారి ఆశీస్సులు జనసేనకు ఎల్లప్పుడూ ఉంటాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రవణం స్వామి నాయుడు, జిల్లా అధ్యక్షులు శ్రీ మేడిశెట్టి సూర్యకిరణ్ (కత్తిపూడి బాబీ) ఆధ్వర్యంలో ఆదివారం పిఠాపురంలో జరిగిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో శ్రీ కె. నాగబాబు గారు ముఖ్య అతిథిగా, రాష్ట్ర అధ్యక్షులు పీ. భవానీ కుమార్, జనసేన స్టార్ కాంపైనర్ శ్రీ సాగర్ (అర్. కే. నాయుడు), ఉపాధ్యక్షులు శ్రీ ఏడిద శ్రీనివాస్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ.. మెగా అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఇతర సేవా కార్యక్రమాల ద్వారా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, రాజకీయ కార్యక్రమాల పట్ల కూడా చురుకైన పాత్ర పోషించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో మెగా అభిమానులు అంతా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన అంతం కావాలంటే అన్ని శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదన్నారు. శ్రీ చిరంజీవి గారి మద్దతు ద్వారా జనసేనకు బలం రెటింపైందని తద్వారా మెగా అభిమానులు అందరికీ బాధ్యత పెరిగిందని పునరుదాటించారు.

కొండేవరం అగ్ని బాధితులకు జనసేన 25 వేల ఆర్ధిక సహాయం

Image

ఇటీవల కొండేవరం గ్రామంలో జరగిన అగ్ని ప్రమాద బాధితులకు జనసేన పార్టీ తరుపున గాది కొండబాబు గారు ఆధ్వర్యంలో గుడివాడ జనసేన యూత్ మరియు భీమవరం యూత్ వారు 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు

కొండేవరం అగ్ని బాధితులకు జనసేన 25 వేల ఆర్ధిక సహాయం

Image

ఇటీవల కొండేవరం గ్రామంలో జరగిన అగ్ని ప్రమాద బాధితులకు జనసేన పార్టీ తరుపున గాది కొండబాబు గారు ఆధ్వర్యంలో గుడివాడ జనసేన యూత్ మరియు భీమవరం యూత్ వారు 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు ..

Live: మొదలైన పవన్ కళ్యాణ్ గారి తెనాలి వారాహి యాత్ర

Image

పవన్ కళ్యాణ్ గారి తెనాలి వారాహి యాత్ర లైవ్ నీ 👇 వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి https://www.youtube.com/live/_Y1LamsbU0M?si=plsny4F1KEq--6Ut

కందరడా గ్రామంలో జరిగిన ఇంటి ఇంటికి జనసేన ప్రచారo కార్యక్రమంలో మహేందర్ రెడ్డి గారు

Image

కందరడా గ్రామంలో జరిగిన ఇంటి ఇంటికి జనసేన ప్రచారo కార్యక్రమంలో కందరడా ఎంపీటీసీ పిల్లా సునితసూర్యనారాయన గారు* జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ మహేందర్ రెడ్డి గారు,నేషనల్ మీడియా స్పోకెపర్సన్ అజయ్ గారు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ బుర్ర కృష్ణంరాజు గారు, ఎలక్షన్ కో ఆర్డినేషన్ టీమ్ dr శ్రీధర్ పిల్లా గారు, నియోజకవర్గ ఏలెక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ టీం వకాపల్లి సూర్యప్రకాష్ ,శివశంకర్ పిల్లా, పిల్లా వెంకట దినేష్,పిల్లా రమ్యజోతి,నియోజకవర్గ మరియు మండల జనసేన ,బీజేపీనాయకులు మోర్చా నాయకురాలు సత్యకుమారి గారు,బీజేపీ మండల ప్రెసిడెంట్ ముత్యలరావు గారు అధిక సంఖ్యలో జనసైనికులు, పాలోగన్నారు

జనసేన క్లిన్ పిఠాపురం - గ్రీన్ పిఠాపురం కార్యక్రమం

Image

'క్లీన్ పిఠాపురం - గ్రీన్ పిఠాపురం' కార్యక్రమం • ముఖ్య అతిధిగా పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు డాక్టర్ బీ.అర్.అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించాలని జనసేన అధ్యక్షులు, పిఠాపురం అభ్యర్థి శ్రీ పవన్ కల్యాణ్ గారు పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా ఉప్పాడ గ్రామంలో ఆదివారం కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంబేడర్క్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ గారు, బీజేపీ నియోజక వర్గం ఇంచార్జ్ శ్రీ బుర్రా కృష్ణంరాజు గారు, కాకినాడ లోక్ సభ అభ్యర్ధి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. అనంతరం ఉప్పాడ వీధుల్లో స్వచ్ఛత కార్యక్రమం చెప్పట్టారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న వైసీపీ చెత్త ప్రభుత్వాన్ని తుడిచేసే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన అందించే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాకా ప్రతి వర్షానికీ న్యాయం చేసామన్నారు.

జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య-నాగబాబు

Image

జగన్ మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అప్రజాస్వమిక చర్య, జనసేన ప్రధాన కార్యదర్శిగా నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు కాని ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య చట్టరీత్యా నేరం, పోలీసు వారు ఈ దాడికి పాల్పడిన దుండగులకి కఠిన శిక్ష వేయాలని మరోమారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు

పిఠాపురం పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో వర్మ

Image

ఈరోజు ఉదయం పిఠాపురం పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరాను. వైసీపీ అరాచక పాలనకు అంతం పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని ప్రజలకు పిలుపునిచ్చాను. అని వర్మ గారు తెలియజేశారు

అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలో పాల్గొన్న - డాక్టర్ పిల్లా శ్రీధర్

Image

ఈరోజు పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలు దళిత నాయకులు వేమగిరి బాబ్జిగారు ఆధ్వర్యంలో, మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ గారు* సమక్షంలో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . పిల్ల శివ శంకర్ , జవ్వాది ప్రసాద్ ,మల్లారపు కుమారి, సిద్ధాంతపునూక రత్నం, వేమగిరి అచ్చారావు, వేమగిరి నాగేంద్ర, నరాల నాగేశ్వరరావు, కరుణ శ్రీను ,దొడ్డి పద్మరాజు , కరణం వెంకటరమణ, కరణం బాలచంద్ర, కరణం సత్తిపండు, బావిశెట్టి పెద్దకాపు తదితరులు పాల్గొన్నారు మరియు అధిక సంఖ్యలో దళిత యువకులు పాల్గొన్నారు

అంటరానితనాన్ని పై పోరాటం చేసిన, యోధుడు అంబేద్కర్- ఉదయ్ శ్రీనివాస్

Image

అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన, యోధుడు అంబేద్కర్ వారిని నేడు స్మరించుకుందాం. మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్ జనసేనపార్టీ ఉమ్మడి అభ్యర్థి

బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం - Pawan Kalyan

Image

న్యాయవాదిగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు బాబాసాహెబ్ బి.ఆర్. అంబేడ్కర్ గారు. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నాను. అంబేడ్కర్ కొందరివాడు కాదు... అందరివాడు... రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని. అసమానతలు, దురహంకారంపై అలుపెరగని పోరాటం చేయడమే కాకుండా సమసమాజ స్థాపన కోసం ఎలా జీవించాలో అంబేడ్కర్ గారు తన రచనల ద్వారా చైతన్యపరచారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాలని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు

హ్యక్ కి గురైన జనసేన యూట్యూబ్ ఛానెల్ బ్యాక్

Image

నిన్న హ్యాక్ గురైన జనసేన యూట్యూబ్ ఛానెల్ యాదస్థితికి రావడం జరిగింది . నిన్న సాయంత్రం ఛానెల్నీ జనసేన డిజిటల్ వర్గాలు తమ అధీనంలోకి తీసుకుని వీడియోస్ నీ రిస్టోరే చేసిన కానీ ఛానెల్ పేరు microsratage నుంచి మరాడిని మూడు గంటల సమయం పట్టింది .. ఇప్పుడు జనసేన యూట్యూబ్ ఛానెల్ పూర్తి స్థాయిలో బ్యాక్ రావడం జరిగింది అఫిషియల్ ఛానెల్ లింక్ 👇 https://youtu.be/LJwOh9m-4VQ?si=palw_pkVDR5ubPUW

కోడి కత్తి కమల్ హాసన్ బ్యాక్ అంటూ టీడీపీ ట్వీట్

Image

ఈరోజు జగన్ పై జరిగిన దాడిని కోడి కత్తి కమల్ హాసన్ బ్యాక్ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది . కోడి కత్తి డ్రామాలే నీ అజెండా... వాటిని తిప్పికొట్టటమే మా అజెండా... గొడ్డలి పోటు రాజకీయం నీ అజెండా... రాష్ట్ర రక్షణకు సిద్ధమాయే మా అజెండా అంటూ ట్వీట్ చేసింది

విరవ గ్రామంలో జోరుగా జనసేన ప్రచారం

Image

విరవ గ్రామంలో ప్రజా మద్దతు హోరుతో విజయవంతంగా కొనసాగుతున్నా ప్రచారం ఈ ప్రచారంలో మా విరవ గ్రామ జనసేన జనసైనికులు తెలుగుదేశం నాయకులు పాల్గొని ప్రతీ ఇంటికి వెళ్లి జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాన్ గారి విజయనికి ప్రజా మద్దతు అడగటం జరిగింది ప్రతీ మనసులో పవన్ ఉన్నాడు ఆది రేపు జరగ బోవు ఎన్నికల్లో మనమంతా చూడబోతున్నాo . @vote for glass @గ్లాస్ గుర్తు కే మన ఓట్లు వేయాలని మనవి చెయ్యడం జరిగిందని విరవ జానసేన కార్యకర్తలు తెలియజేశారు

ఈ నెల 16,17 గోకివాడ గ్రామంలో జనసేన ప్రచార కార్యక్రమం

Image

జనసేన నాయకులు మరియు జనసైనికులకు మనవి ది 16-04-24 మరియు 17-04-24 లలో అనగా మంగళ, బుధవారాలలో గోకివాడ గ్రామంలో జనసేన ప్రచార కార్యక్రమ జరుగుతుంది కావున పిల్లలు పెద్దలు తేడా లేకుండా కుల, మతాలకు అతీతంగా జనసేనాని కోసం మేము సైతం అంటూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సెలబ్రేటీలు పాల్గొంటారు. ఇట్లు గోకివాడ జనసేన పార్టీ

రేపు పిఠాపురం లో జనసేన Clean Pithapuram - Green Pithapuram కార్యక్రమం

Image

ఏప్రిల్ 14 ఉదయం ఆదివారం 7 నుండి 11 గంటల వరకు, ఉప్పాడ సెంటర్ లో "Clean Pithapuram - Green Pithapuram" కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒకరు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. • మన సుందరమైన పిఠాపురం నియోజకవర్గాన్ని నిత్యం శుభ్రం చేద్దాం పరిశుభ్రంగా ఉంచుదాం.. ఇట్లు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం

మన Jspptp యాప్ సరికొత్త అప్డేట్ రిలీజ్ చేయడం జరగింది

Image

మన Jspptp యాప్ చాలా తక్కువ టైమ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది . ఎటువంటి లాభపాటి లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు పై అభిమానం తో క్రియేట్ చేసిన పిఠాపురం జనసేన(jspptp) యాప్ 200+ డౌన్లోడ్ తో 3k న్యూస్ వ్యూస్ తో ఎటువంటి యాప్ షేర్స్ , ఆర్భాటం ప్రచారం లేకుండా యూజర్ డిటైల్స్ స్టోరేజ్ లేకుండా కేవలం ఒక నోటికేషన్ తో చాలా మందికి న్యూస్ నీ చెరవేసింది . అనేక మంది బయట వాళ్లు కేవలం యాప్ ద్వారా న్యూస్ తెలుసుకున్న వాళ్లు ఉన్నారు .. ఇప్పుడు సరికొత్త అప్డేట్ రిలీజ్ చేయడం జరిగింది . ప్రతి పోస్ట్ షేర్ లో "పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేద్దాము,ప్రజాగళాన్ని అసెంబ్లీ వినిపిద్దాం " అనే నినాదం ఉంటుంది .. Url లింక్స్ డైరెక్ట్ గా క్లిక్ చేసి live చూడచ్చు .. మీరు పిఠాపురం నియోజకవర్గం లో జనసేన తరుపున ప్రచారం చేసే కార్యక్రమాలు, డైలీ ప్రచార షెడ్యూల్స్ యాప్ లో రావాలి అనుకుంటే మా WhatsApp నెంబర్ కి న్యూస్ send చేయండి wa.me/918978970939 యాప్ అప్డేట్, డౌన్లోడ్ కోసం 👇 కింద లింక్ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.sr.JspPtp

ఓటరుగా నమోదుకు అవకాశం చివరి 3 రోజులే

Image

ఓటరుగా నమోదుకు అవకాశం చివరి 3 రోజులే త్వరగా స్పందించి ఓటు నమోదు చేసుకోండి ఈ సార్వత్రిక ఎన్నికలలో మీ ఓటు ఉపయోగించుకునే అవకాశం 2006 మార్చి 31లోపు పుట్టిన వారు,18 ఏళ్లు నిండిన వారు అర్హులు 👇 voters.eci.gov.in ప్రజాస్వామ్య పరిరక్షణ, అవినీతి రహిత ప్రభుత్వాల కోసం యువత కదిలి తక్షణమే ఓటు నమోదు చేసుకోండి.

జల్లూరు గ్రామంలో జనసేన డోర్ తో డోర్ ప్రచారం

Image

పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామంలో వెన్న జగదీష్ గారు, బండి హరీష్, వీరంరెడ్డి చిన్న, బత్తిన దొరబాబు, మరియు బీజేపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఉమ్మల పద్మజ గారు తెలుగుదేశం కార్యకర్త వీధి రాంబాబు గారు ఈ రోజు డోర్ టు డోర్ తిరుగుతూ మ్యానిఫెస్టోలో ని అంశాలను వివరిస్తూ ప్రచారం చెయ్యడం జరిగింది.. ఈ ప్రచార కార్యక్రమంలో జల్లూరు గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు, మరియు ఎఫ్.కె పాలెం జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది..

Svsn వర్మ పిఠాపురంలో ఓటమి ఖాయమని తెలిసే దొంగ డ్రామాలకు తెర తీశారు

Image

తాజాగా వైఎస్ఆర్సీపీ official సోషల్ మీడియా అకౌంట్స్ లో వర్మ గారి పాత videos షేర్ చేస్తూ కూటమి మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది . పిఠాపురంలో ఓటమి ఖాయమని తెలిసే దొంగ డ్రామాలకు తెర తీశారు.పాత వీడియోలను వైరల్‌ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారు. మీ కుట్రలకు భయపడేదే లేదు. పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ గారి గెలుపు ఖాయమైపోయింది. మీరు తలకిందుల తపస్సు చేసినా కూటమి విజయాన్ని అడ్డుకోలేరు నీ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు .

జనసేన పార్టీని వదిలి వెళ్ళిన నాయకులకి చెప్తున్నా

Image

నేను ఏరోజు ఏ నాయకుడిని వెళ్ళిపొమ్మని చెప్పలేదు, కొంతమంది నాయకులు వెళ్లిపోవచ్చు, కానీ ఎవరూ వచ్చినా వెళ్ళినా జనసేన పార్టీ ఉంటుంది, నా జనసైనికులు ఉంటారు. జనసైనికులు రాష్ట్ర క్షేమం కోసం , ప్రజా క్షేమం కోసం నిలబడే వారు. నా సినిమాలు ఆపేసినప్పుడు చెప్పాను మనల్ని ఎవడ్రా ఆపేది అని, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం రాకుండా మనల్ని ఎవడ్రా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారు అమలాపురం సభలో వ్యాఖ్యానించారు

కొండేవరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా జనసేన

Image

కొణిదల వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కర్ణ మురళీకృష్ణ నాయుడు గారు కొండేవరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10000 చొప్పున 5 కుటుంబాలకు 50000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది . సంఘటన జరిగిన వెంటనే గ్రామ జనసేన కార్యకర్తలు వెంటనే స్పందించి సహాయ కార్యక్రమంలో పాల్గొనడం తో పాటు బాధితులకు ఆర్థికంగా అండగా నిలిచారు .

కొండేవరం లో ఈరోజు జనసేన కూటమి సమావేశం

Image

ఈరోజు అనగా ఏప్రియల్ 10th బుధవారం సాయంత్రం 5:00 గంటలకు కొండేవరం జనసేన తెలుగుదేశం బిజెపి మూడు పార్టీ లు ఉమ్మడి గా కలిసి పనిచేయడానికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం భవిషత్తు కార్యాచరణ మన గ్రామం లో ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మాన్ని పాటించి ముందుకు నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు కి భారీ మెజారిటీ దిశగా మన గ్రామం నుండి పనిచేయడానికి ప్రతి ఒక్క జనసేన తెలుగుదేశం బిజెపి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు మన గ్రామ పంచాయతీ అవరణం లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము కావున తప్పకుండా పాల్గొని తమ సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము - జనసేన పార్టీ కొండేవరం

ఈరోజు (Apr 10) . పవన్ కళ్యాణ్ గారి పర్యటన వివరాలు

Image

ఈ రోజు (ఏప్రిల్ 10) ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తణుకు, నిడదవోలు నియోజకవర్గం ప్రజా గళం , వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో పాల్గొననున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. • ప్రజా గళం (4pm) నరేంద్ర సెంటర్, తణుకు టౌన్ • వారాహి విజయభేరి (7pm) గణేష్ చౌక్,నిడదవోలు

పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గారు ఘనంగా ఉగాది వేడుకలు

Image

పిఠాపురం నియోజక వర్గం చేబ్రోలులోని నివాస గృహంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజక వర్గం టిడిపి ఇంఛార్జి శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంఛార్జి శ్రీ కృష్ణం రాజు గారు పాల్గొన్నారు

పిఠాపురంలో నూతన గృహం వద్దకు చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు..

Image

కొద్ది క్షణాలు క్రితం పిఠాపురంలో నూతన గృహం వద్దకు చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. ఉగాది ఉత్సవాలను కొత్త ఇంటిలో జరుపుకోనున్నారు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉగాది ఉత్సవాలు తర్వాత లోకల్ నాయకులను కలిసి ఎలక్షన్ ప్రచారం గురించి చర్చించనున్నారు .

తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Image

తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నాని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు

నూకాలమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా-పవన్ కళ్యాణ్

Image

• NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తెలంగాణ లో సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్ లో నూకాలమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించేలా చూస్తాను - అనకాపల్లిలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తుంది వీళ్లే

Image

Janasena Party 2024 Elections. *MLA Candidates* 1. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ - పిఠాపురం 2. శ్రీ బత్తుల బలరామకృష్ణ - రాజానగరం 3. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ - తాడేపల్లిగూడెం 4. శ్రీ వంశీకృష్ణ యాదవ్ - వైజాగ్ సౌత్ 5. శ్రీ కొణతాల రామకృష్ణ - అనకాపల్లి 6. శ్రీ పంచకర్ల రమేష్ - పెందుర్తి 7. శ్రీ ఆరణి శ్రీనివాసులు - తిరుపతి 8. శ్రీ కందుల దుర్గేష్ - నిడుదవోలు 9. శ్రీ పులపర్తి ఆంజనేయులు - భీమవరం 10. శ్రీ సుందరపు విజయ్ కుమార్ - యలమంచిలి 11. శ్రీ బొమ్మిడి నాయకర్ - నరసాపురం 12. శ్రీ పత్సమట్ల ధర్మరాజు - ఉంగుటూరు 13. శ్రీమతి లోకం మాధవి - నెల్లిమర్ల 14. శ్రీ పంతం నానాజీ - కాకినాడ రూరల్ 15. శ్రీ నాదెండ్ల మనోహర్ - తెనాలి 16. శ్రీ దేవ వరప్రసాద్ - రాజోలు 17. శ్రీ గిడ్డి సత్యనారాయణ - పి గన్నవరం 18. శ్రీ చిర్రి బాలరాజు - పోలవరం 19. శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ - అవనిగడ్డ 20. శ్రీ అరవ శ్రీధర్‌ - రైల్వే కోడూరు 21. శ్రీ నిమ్మక జయకృష్ణ - పాలకొండ *MP Candidates* 1. శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ - కాకినాడ 2. శ్రీ బాలశౌరి - మచిలీపట్నం🙏✊

పిఠాపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ జనసేనలో చేరిక

Image

పిఠాపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, శ్రీ కృష్ణ యాదవ సంఘం పిఠాపురం నియోజకవర్గం అధ్యక్షులు శ్రీ జోగా వీర వెంకట రమణ యాదవ్, యువజన విభాగం అధ్యక్షులు శ్రీ సారిమల్లి రమేష్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో శుక్రవారం జనసేన పార్టీ ప్రధాన శ్రీ కె. నాగబాబు గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన ఎన్.అర్.ఐ. విభాగం ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ కొలికొండ శశిధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ పిండి శ్రీనివాసరావు, శ్రీ కోన శివ, శ్రీ పాలకొల్లు శంకర్ పాల్గొన్నారు.

కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారా?

Image

ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు

పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా

Image

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతోపాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు. కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు. రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు..

చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ గారు

Image

పిఠాపురంలోని ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జనసేన అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు

పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ శ్రేణులకు ముఖ్య సమాచారం.

Image

అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ 02-04-2024 / మంగళవారం *కార్యక్రమాల వివరాలు* *రూట్ మ్యాప్…* గొల్లప్రోలు హెలిప్యాడ్ నుండి పిఠాపురం అగ్రహారం మీదుగా RTC కాంప్లెక్స్, చర్చ్ సెంటర్… 1. *ABC(ఆంధ్ర బాపిస్ట్ చర్చ్)* *ఉదయం 9 గంటలకు* చర్చ్ నందు శ్రీ కళ్యాణ్ గారు సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగును…తర్వాత 2. *బషీర్ బీబీ దర్గా(బంగారు పాప)* పొన్నాడ-యూ.కొత్తపల్లి మండలం మాదాపురం ఉప్పరగూడెం నాగులపల్లి పొన్నాడ *బషీర్ బీబీ దర్గా* *తిగిరి వచ్చు రూట్…* మూలపేట జంక్షన్ అమీనాబాద్ ఉప్పాడ కొత్తపల్లి *(మహిళలతో మీటింగ్-సురక్ష ప్యాలెస్ ఫంక్షన్ హాల్)* వాకతిప్ప ఎండపల్లి జంక్షన్ కొండెవరం నవ ఖండ్రావాడ డ్రైవర్ కాలనీ పిఠాపురం పట్టణం, ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, టౌన్ పోలీస్ స్టేషన్, పాదగయా జంక్షన్, కుమారపురం, గోకుల్ గ్రాండ్ హోటల్. కావున పైన చెప్పిన ఏరియా/గ్రామాల జనసేనపార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలికి ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుచున్నాము. *జనసేనపార్టీ కార్యాలయం,* పిఠాపురం.

ఉదయ్ శ్రీనివాస్ కి అండగా నిలవాలి - పవన్ కళ్యాణ్

Image

జనసిన పార్టీ నుంచి కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస కష్టపడి పైకి ఎదిగిన యువకుడు. 2017లో రూ.10 లక్షల పెట్టుబడితో మొదలు పెట్టిన టీ టైం వ్యాపార ప్రస్థానం దేశం దాటి నేపాల్ లో కూడా విస్తరించింది. యువత తెలివితేటలకు ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యక్ష తార్కాణం. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ మంచి వ్యక్తి అయితే తప్పుడు పార్టీలను ఎంచుకుంటారు. ఆయన ఇక్కడ సంపదను పట్టుకుపోతే. ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ నుంచి సంపద సృష్టించి యువతకు దారి చూపుతాడు. అలాంటి యువకుడికి మీరంతా అండగా నిలబడాలి.

వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే ఏకైక లక్ష్యం- పవన్ కళ్యాణ్

Image

వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టడమే ఏకైక లక్ష్యం •రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా నిష్టగా పని చేద్దాం •రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తు కోసం తపించాను • రాబోయేది కూటమి ప్రభుత్వమే.. భారీ మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం •మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా గెలుపు కోసం ముందుకు •పిఠాపురం నియోజకవర్గ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమన్వయ సమావేశంలో ప్రసంగించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Image

• శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు • శ్రీ పాద శ్రీవల్లభస్వామి దర్శనం • అష్టోత్తర కుంకుమార్చనతో విశిష్ట పూజలు నిర్వహించి వేదాశీర్వచనాలు అందించిన అర్చకులు అష్టాదశ శక్తి పీఠాల్లో మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచిన పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రాన్ని ఆదివారం ఉదయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర కుంకుమార్చన చేసి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజా క్రతువులను ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్తి చేసి అమ్మ ఆశీస్సులు స్వీకరించారు. ఆలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మొదట విఘ్నేశ్వరుని పూజించి శ్రీ పాద శ్రీవల్లభుడి మూల స్థానం అయిన అవదంభర వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. దత్తాత్రేయ అవతారం అయిన శ్రీ పాదవల్లభుని చరిత్రను ఈ సందర్భంగా అర్చక స్వాములు ఆయనకు వివరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. • అయ్యవారు, అమ్మవార్లకు అర్చనలు శ్రీపాద వలభుని దర్శనానంతరం స్పటిక లింగాకారుడైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి పురుహుతికా అమ్మవారి దర్శనానికి వెళ్లారు. శక్తి పీఠంలో ప్రదక్షిణ అనంతరం అమ్మవారికి పట్టు చీర సమర్పించారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అత్యంత మహిమాన్విత శ్రీ చక్రాన్ని తాకి మొక్కులు మొక్కారు. అనంతరం పురుహుతిక అమ్మవారి ఆలయం మండపంలో వేద ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందచేశారు. • దత్త పీఠ సందర్శన అమ్మవారి దర్శనానంతరం ప్రముఖ దత్త క్షేత్రంగా పేరున్న దత్తపీఠానికి వెళ్లారు. అక్కడ శ్రీపాద వల్లభుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి కరుణ కటాక్షాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్షలు సిద్ధించాలన్న సంకల్పంతో వేద మంత్రోచ్చరణలతో అర్చనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ పాదవల్లభునికి పట్టువస్త్రాలు సమర్పించారు. మోకాళ్లపై కూర్చొని దత్తాత్రేయునికి మొక్కారు. స్వామి వారికి పూజలు చేసిన ప్రత్యేక వస్త్రాలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సత్కరించారు. దత్తపీఠం ఆవరణలో ఉన్న అవదంభర వృక్షానికి నారికేళ ముడుపు కట్టి మొక్కులు మొక్కారు. ఈ కార్యక్రమంలో కాకినాడ లోక్ సభ జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజక వర్గ పార్టీ నేతలు పాల్గొన్నారు.

పాదగయ క్షేత్రం దర్శనం చేసుకున్న పవన్ కళ్యాణ్

Image

పిఠాపురం పర్యటన లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రెండవ రోజు పాదగయ దర్శనం చేసుకున్నారు .అనంతరం పిఠాపురం లో JGR హాస్పిటల్ ప్రారంభించారు ..

పిఠాపురం ప్రజలకు జనసేనాని హామీలు

Image

• టెంపుల్ సర్క్యూట్ సిటీగా పిఠాపురం, కేంద్రం నుండి 100 కోట్ల నిధులు • గొల్లప్రోలు సంత అభివృద్ధి • ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధి, సూరయ్య మాన్యం రైతులకు న్యాయం • ప్రతీ మండలానికి ఆదునిక ఆసుపత్రి నిర్మాణం • పట్టు రైతులకు ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయం, ఆప్టిమైజింగ్ సెంటర్ ఏర్పాటు • సీడ్ సెంటర్ ఏర్పాటు • గొల్లప్రోలు లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు • దుర్గాడ మిర్చి పంటకు క్రాషింగ్ ఫ్లోర్ ఏర్పాటు • కొత్తపల్లి SEZ కు కొత్త పరిశ్రమలు, యువతకు ఉపాధి కల్పన

శ్రీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ 31-03-2024 / ఆదివారం

Image

పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ శ్రేణులకు ముఖ్య గమనిక: అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ 31-03-2024 / ఆదివారం 1. ⁠JGR హాస్పిటల్స్ ప్రారంభోత్సవం (జగ్గయ్యచెరువు) 2. ⁠పాదగయా క్షేత్రం నందు ప్రత్యేక పూజలు 3. ⁠శ్రీ పాద శ్రీవల్లభ దత్తత్రేయుని దర్శనం. 4. ⁠బషీర్ బీబీ దర్గా(బంగారు పాప, పొన్నాడ గ్రామం) కావున పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ శ్రేణులు తప్పక పాల్గొనవలెను. *జనసేనపార్టీ కార్యాలయం,* పిఠాపురం.

వైసిపికి భవిష్యత్ మనమని తెలుసు- పవన్ కళ్యాణ్

Image

నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు మండలానికి ఒక నాయకుడు పెట్టారు నాకు పట్టుమని పాతికమంది ఎమ్మెల్యేలను నిలబెట్టలేని పరిస్థితి నాది కనీసం రెండు ఎంపీలను గెలిపించుకోవాలని తప్పను ఉన్న నాకోసం ఎందుకు ఇంతలాగ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుందంటే భవిష్యత్తు మనమని వైఎస్ఆర్సీపీ కి తెలుసు

వైసిపికి భవిష్యత్ మనమని తెలుసు- పవన్ కళ్యాణ్

Image

నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి పాపం మిథున్ రెడ్డి గారు వచ్చారు మండలానికి ఒక నాయకుడు పెట్టారు నాకు పట్టుమని పాతికమంది ఎమ్మెల్యేలను నిలబెట్టలేని పరిస్థితి నాది కనీసం రెండు ఎంపీలను గెలిపించుకోవాలని తప్పను ఉన్న నాకోసం ఎందుకు ఇంతలాగ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుందంటే భవిష్యత్తు మనమని వైఎస్ఆర్సీపీ కి తెలుసు

Libs- మొదలు అయిన పవన్ ప్రసంగం

Image

జనసేన మొదటి ఎన్నికలు ప్రచారం చేబ్రోలు నుంచి పవన్ ప్రసంగం మొదలైంది లైవ్

పిఠాపురం లో అశేష జనం

Image

ఈరోజు పిఠాపురం నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు జనం పట్టం కట్టారు ..సాయంత్రం 6.30 కి మొదలు కావాల్సిన పవన్ ప్రసంగం 8.30 అవుతున్న మొదలు కాలేదంటే మనం అర్దం చేసుకోవచ్చు జనం ఎంతలాగ పవన్ కళ్యాణ్ కి నీరాజనం పడుతున్నారో .. అడుగు అడుగున జనం పువ్వులు జలుతు తమ అభిమానాన్ని చాటుకున్నారు .పెద్ద ఎత్తున మహిళలు హారతి పడుతున్నారు .. తమ అభిమాన నాయకుడు ప్రజా నాయకుడు పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఒకసారిగా పిఠాపురం మొత్తం పవన్ నినాదంతో మారుమోగిపోతోంది

సభ ప్రాంగణం వద్దకు చేరుకున్న పవన్ కళ్యాణ్

Image

ఈరోజు పిఠాపురం నియోజవర్గంలో పర్యటనలో భాగంగా చేబ్రోలు రామాలయం వద్దకు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంలో చేరుకున్నారు మరి కాసేపట్లో పవన్ ప్రసంగం మొదలుకానుంది

Svsn వర్మ ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్

Image

పిఠాపురం పర్యటనలో గొల్లప్రోలు లో లాండ్ అయిన పవన్ కళ్యాణ్ నేరుగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్చార్జి వర్మ ఇంటికి చేరుకున్నారు .. పవన్ కళ్యాణ్ నీ సాదరంగా ఆహ్వానించన వర్మ 2024 ఎన్నికలో పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు

పిఠాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్

Image

పిఠాపురం పర్యాటంలో భాగంగా కాసేపటి క్రితం హెలికాప్టర్లో ల్యాండ్ అయిన పవన్ కళ్యాణ్ . పిఠాపురం మీదగా దొంతమూరు ప్రయాణం

పవన్ కళ్యాణ్ పర్యటనలో స్వల మార్పు

Image

ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో స్వల్ప మార్పులు ఒంటిగంట తరువాత దేవాలయాలు మూసివేస్తున్న కారణంగా పవన్ కళ్యాణ్ గారు షెడ్యూల్లో మార్పు హెలికాప్టర్ దిగిన వెంటనే బి.ప్రత్తిపాడు భోగాపురం, రాపర్తి, రాయవరం మీదుగా దొంతమూరు వెళ్తారు...

పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన వివరాలు (30-3-24)

Image

ఈరోజు జరుగు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కళ్యాన్ గారి పిఠాపురం పర్యటన వివరాలు schedule tab లో అప్డేట్ చేయడం జరిగింది

పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ శ్రేణులకు ముఖ్య గమనిక

Image

అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు… 30-03-2024 / శనివారం, మధ్యాహ్నం 12 గంటలకు గొల్లప్రోలు బాయ్స్ హైస్కూల్ వద్ద ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఘన స్వాగతం పలకడానికి జనసేనపార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనవలెను. జనసేనపార్టీ కార్యాలయం, పిఠాపురం.

పవన్ కళ్యాణ్ గారి తొలి విడత- ఎన్నికల ప్రచార పర్యటన వివరాలు

Image

మార్చ్ 30 - ఏప్రిల్ 2 వరకు పిఠాపురం ఏప్రిల్ 3 - తెనాలి • ఏప్రిల్ 4 - నెల్లిమర్ల • ఏప్రిల్ 5 - అనకాపల్లి • ఏప్రిల్ 6 - ఎలమంచిలి • ఏప్రిల్ 7 - పెందుర్తి • ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్ • ఏప్రిల్ 9 - పిఠాపురంలో ఉగాది వేడుకలు • ఏప్రిల్ 10 - రాజోలు • ఏప్రిల్ 11 - P. గన్నవరం • ఏప్రిల్ 12 - రాజానగరం

జనసేన ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకి కార్యాచరణ మీటింగ్

Image

ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకి మన పిఠాపురం జనసేన పార్టీ ఆఫీసు లో ఉదయ్ శ్రీనివాస్ గారు అధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్న సందర్భంగా కార్యాచరణ మీటింగ్ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని కోరుకుంటున్నాము

వీర మహిళలు జనసేనకు వెన్నుదన్ను

Image

వీర మహిళలు జనసేనకు వెన్నుదన్ను • పార్టీలో మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం • జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా వీర మహిళల ఎదుగుదలకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వీర మహిళలు పార్టీకి మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలిచారని, ప్రజా పోరాటాల్లోనూ ముందు వరుసలో నిలబడ్డారని తెలిపారు. పార్టీ కోసం నిలబడిన వీర మహిళలను పార్టీ మర్చిపోదని భరోసా ఇచ్చారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ కమిటీల్లో ఉన్న వీర మహిళలకు నియామకపత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "కులం, మతం, ప్రాంతాలు దాటి మహిళా నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపర్చే బాధ్యత తీసుకుంటాను. పార్టీకి, పాలనకు వారధిగా నిలిచేలా వారి సేవలు ఉపయోగించుకుంటాము. ప్రజా క్షేత్రంలో వీర మహిళలు చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేము. అపజయంలోనూ వెనక్కి తగ్గకుండా గత అయిదేళ్లుగా వీర మహిళలు పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన తీరు గొప్పది. మీ మద్దతు ఇలాగే కొనసాగించాలి. కూటమి అభ్యర్ధుల విజయానికి పూర్తి స్థాయిలో పని చేయాలి" అన్నారు.

రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి- పవన్ కళ్యాణ్

Image

ఆస్కార్ పురస్కారాలు పొందిన చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందాన్ని... సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దలు, అనుభవజ్ఞులపట్ల గౌరవమర్యాదలతో ఉంటాడు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఒక విద్యార్థిలా నడుచుకుంటాడు. అవే శ్రీరామ రక్షగా నిలుస్తాయి... మరింత ఉన్నత స్థాయికి ఎదగటానికి దోహదపడతాయి. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు వెళ్తున్న చరణ్- రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు

జనసేన పార్టీకి 10 కోట్ల వివరాలం

Image

జనసేన పార్టీ కి పవన్ కళ్యాణ్ గారు 10 కోట్ల విరాళం గా తన పారితోషకం నుంచి ఇవ్వడం జరగింది .. ఎంతో మంది సామాన్యులు తమ డైలీ సంపాదనలో కొంచెం బాగం దాచుకుని విరాళంగా పంపిస్తున్నారు అలాంటి వ్యక్తులను చూస్తుంటే సమాజంలో మార్పు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్దం అవుతుంది . అలాంటి వ్యక్తుల ఆశలు ,ఆశయాలతో పుట్టిన పార్టీ జనసేన గా అభివర్ణించారు

మరోసారి పవన్ కళ్యాన్ తన ఔన్నత్యాని చాటుకున్నారు

Image

జనసేన పార్టీ కి పవన్ కళ్యాణ్ గారు 10 కోట్ల విరాళం గా తన పారితోషకం నుంచి ఇవ్వడం జరగింది .. ఎంతో మంది సామాన్యులు తమ డైలీ సంపాదనలో కొంచెం బాగం దాచుకుని విరాళంగా పంపిస్తున్నారు అలాంటి వ్యక్తులను చూస్తుంటే సమాజంలో మార్పు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్దం అవుతుంది . అలాంటి వ్యక్తుల ఆశలు ,ఆశయాలతో పుట్టిన పార్టీ జనసేన గా అభివర్ణించారు

గోదావరి జిల్లాల్లో జనసేన గెలుపు గుర్రాలు

Image

గోదావరి జిల్లాల్లో జనసేన గెలుపు గుర్రాలు✊✊ 1) పిఠాపురం- శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు 2) నిడదవోలు- శ్రీ కందుల దుర్గేష్ గారు 3) తాడేపల్లిగూడెం- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు 4) ఉంగుటూరు- శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారు 5) పోలవరం- శ్రీ చిర్రి బాలరాజు గారు 6) రాజానగరం- బత్తుల బలరామకృష్ణ గారు 7) కాకినాడ రూరల్- శ్రీ పంతం నానాజీ గారు 8)రాజోలు- శ్రీ దేవ వరప్రసాద్ గారు 9) నర్సాపురం- శ్రీ బొమ్మిడి నాయకర్ గారు 10) భీమవరం- పులపర్తి ఆంజనేయలు గారు 11) పి. గన్నవరం- గిడ్డి సత్యనారాయణ గారు 12) కాకినాడ ఎంపీ- శ్రీ తంగెళ్ల ఉదయ్ గారు

పిఠాపురం కేంద్రంగా జనసేనని రాజకీయం

Image

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఈ మేరకు సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని... అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్స్ రూపొందించాలని స్పష్టం చేశారు. మూడు విడతలుగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్ళేలా షెడ్యూల్ ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పిఠాపురం వెళ్ళిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురూహూతిక అమ్మవారి దర్శనం చేసుకొంటారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేయిస్తారు. అనంతరం దత్తపీఠాన్ని దర్శిస్తారు. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటారు. ఈ క్రమంలో పార్టీ నాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీలక కార్యకర్తలతో మండలాలవారీగా సమావేశాలు ఉంటాయి. కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, బీజేపీ నాయకులతో భేటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశం ఉంటాయి. సర్వమత ప్రార్ధనల్లో పాల్గొంటారు. ఉగాది వేడుకలను పిఠాపురంలోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించుకోబోతున్నారు.

పిఠాపురం లో పవన్ కళ్యాణ్ పర్యటన

Image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల ప్రచారానికి సిద్దం అయ్యారు ఈ నెల 30 వ తేదీన పిఠాపురం చేరుకుంటారు ఈ నెల 31 వ తారీఖున పిఠాపురం నుంచి ప్రారంభం చేయనున్నారు మూడు రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేస్తారు

పిఠాపురం జనసేనపార్టీ శ్రేణులకు ముఖ్య గమనిక…

Image

పిఠాపురం జనసేనపార్టీ శ్రేణులకు ముఖ్య గమనిక… ఈ రోజు ది. 25-03-2024, సాయంత్రం 5 గంటలకు పిఠాపురం పట్టణం, జనసేనపార్టీ కార్యాలయం వద్ద కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేన అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో పిఠాపురం పట్టణ నూతన చేరికల కార్యక్రమం జరుగబడును. కావున నియోజకవర్గ జనసేనపార్టీ శ్రేణులు తప్పక పాల్గొనవలెను. జనసేనపార్టీ కార్యాలయం పిఠాపురం

కొత్త కలర్స్ నీ యాడ్ చేసుకుందాము హోలీ శుభాకాంక్షలు - జనసేన పార్టీ

Image

జనసేన పార్టీ నాయకులకు,కార్యకర్తలకు హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ నుంచి మరిన్ని కొత్త రంగులు మన జీవితాల్లో యాడ్ అవ్వి మన భవిష్యత్తు మరింత కొత్తగా సజావుగా సాగిపోవాలని కోరుకుంటున్నాము .. Have a safe Holi

జనసేన 18 స్థానాలకు అధికారిక ప్రకటన

Image

జనసేన అభ్యర్థుల జాబితా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాల్లో 11 మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తూ ఆదివారం రాత్రి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. తొలుత 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. తదుపరి మరో రెండు స్థానాలను అభ్యర్ధులను ప్రకటించారు. మొత్తంగా 18 స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేయవలసి ఉంది. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వం ఇటీవలే ఖరారు చేశారు. పిఠాపురం శ్రీ పవన్ కల్యాణ్ నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి అనకాపల్లి శ్రీ కొణతాల రామకృష్ణ కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ రాజానగరం శ్రీ బత్తుల బలరామకృష్ణ తెనాలి శ్రీ నాదెండ్ల మనోహర్ నిడదవోలు శ్రీ కందుల దుర్గేష్ పెందుర్తి శ్రీ పంచకర్ల రమేష్ బాబు యలమంచిలి శ్రీ సుందరపు విజయ్ కుమార్ పి.గన్నవరం శ్రీ గిడ్డి సత్యనారాయణ రాజోలు శ్రీ దేవ వరప్రసాద్ తాడేపల్లిగూడెం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ భీమవరం శ్రీ పులపర్తి ఆంజనేయులు నరసాపురం శ్రీ బొమ్మిడి నాయకర్ ఉంగుటూరు శ్రీ పత్సమట్ల ధర్మరాజు పోలవరం శ్రీ చిర్రి బాలరాజు తిరుపతి శ్రీ ఆరణి శ్రీనివాసులు రైల్వే కోడూరు డా. యనమల భాస్కర రావు

పవన్ కళ్యాణ్ కలిసిన SVSN వర్మ

Image

ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ svsn వర్మ ఆయన వెంట నియోజకవర్గ టీడీపీ నాయకులు కూడా ఉన్నారు

లక్ష మెజార్టీ తో పవన్ నీ గెలిపించుకుంటాము - వర్మ

Image

మంగళగిరిలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ,చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు . పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయుచున్న జనసేన అధినేతను పవన్ కళ్యాణ్ ను లక్ష మెజార్టీ తో గెలిపించుకునే దిశగా టీడీపీ, జనసేన శ్రేణులతో సమావేశాలు నిర్వహించి జనంలోకి తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు.

శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు

Image

పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ *శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి* జనసేన పార్టీ అధ్యక్షుడు *శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు* కాకినాడ పార్లమెంట్ MP సీటు ను కేటాయించిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత *డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు* ఉదయ్ శ్రీనివాస్ గారిని శాలువాతో సత్కరించడం జరిగింది అనంతరం *డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు* మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారిని కాకినాడ ఎంపీగా అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవడానికి కూడా మరింత కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష ఓట్ల మెజారిటీతో పాటు ఎంపీగా కాకినాడ పార్లమెంటు స్థానంలో ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా అత్యధిక మెజారిటీ రావడానికి గట్టిగా కృషి చేస్తామని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు *డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు* కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా Ex సర్పంచ్ సీనియర్ తెలుగు దేశం నాయకులు జ్యోతుల సతీష్ గారు, Ex సర్పంచ్ గరగా సత్యనందరావు గారు, వీరం రెడ్డి అమర్ గారు, బోజ్జ గోపికృష్ణ గారు, ఇంటి వీరబాబు గారు, Ex సర్పంచ్ కరెడ్ల తాతీలు గారు, Ex సర్పంచ్ ఎలిగొండ రాజారావు గారు, Ex సర్పంచ్ కుంపట్ల చల్లారావు గారు, జవ్వది జోగేశ్వరరావు గారు, దుడ్డు నాగు గారు, రంగనాథం రాజుగారు, బస్స నాగసత్తులు గారు, జవ్వది గంగాధర్ గారు, కీర్తి చంటి గారు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

Image

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చేపట్టే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పార్టీ ముఖ్యులతో ఈ అంశంపై చర్చించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం... శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలుపెడతారు. ఆ నియోజక వర్గంలోనే మూడు రోజులపాటు ఉంటారు. నియోజక వర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పార్టీ ప్రెసిడెంట్ టూర్ మేనేజ్మెంట్ టీం కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులతో శ్రీ పవన్ కల్యాణ్ గారు సమావేశమయ్యారు. పిఠాపురం నుంచి మొదలుపెట్టనున్న ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోందని... ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి... ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో కచ్చితంగా విజయం మనదే అని చెప్పారు. పిఠాపురం నుంచే జనసేన శంఖం పూరిస్తుందని... ఈ విజయ నాదం రాష్ట్రం నాలుగు వైపులా వినిపించాలన్నారు. ఎన్నికల నియమనిబంధనలు పాటించడంపైనా టూర్ మేనేజ్మెంట్ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి.మహేందర్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆ గళం అసెంబ్లీలో అడుగు పెట్టకూడదా

Image

ఆ గళం అసెంబ్లీలో అడుగు పెట్టకూడదా పవన్ మాట అసెంబ్లీ వినిపించకూడదా . అడుగు పెడితే ఏమీ అవుతాది , ఆ గళం అసెంబ్లీ లో మాట్లాడితే ఏమీ అవుతాది.. మీ తప్పులని ప్రశ్నిస్తాడా.. పేదవాడి బాధను రాష్ట్రంలో అందరికి వినిపిస్తాడా రైతు కన్నీరును చూపిస్తాడా .. యువత తరుపున ఉద్యోగాలు అడుగుతాడా.. మహిళలు కు రక్షణ ఎక్కడని ప్రశ్నిస్తాడా .. ఎందుకు అంత భయం ఒక గళం అసెంబ్లీలో ప్రశ్నించబోతుందని సంక్షేమం పేరుతో మీరు చేసిన అవినీతి అమాయక ప్రజలకు చూపిస్తాడనా .. నిలబడుతున్నము బలంగా మీ ఆర్ధిక బలం ముందు మా నిజాయితి ఏమిటో చూపించి .. త్వరలో పవన్ కళ్యాణ్ గారి అనే నేను అనే మాట అసెంబ్లీ లో వినిపిస్తాము

అతికొద్ది గంటల్లోనే 100+ సాధించిన JspPtp యాప్

Image

మన Jspptp యాప్ రిలీజ్ చేసిన అతికొద్ది గంటల్లోనే 100 డౌన్లోడ్ సాధించింది Thanks for your support towards Jspptp we will provide better content Thanks and Regards JspPtp

ఓటుకు లక్ష పంచినా పిఠాపురంలో జనసేనదే గెలుపు

Image

ఓటుకు లక్ష పంచినా పిఠాపురంలో జనసేనదే గెలుపు • దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను • విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం • శ్రీమతి వంగా గీత, శ్రీ చలమలశెట్టి సునీల్ భవిష్యత్తులో జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా • కాకినాడ లోక్ సభ స్థానం జనసేన అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ • జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం • పిఠాపురం నియోజకవర్గం నుంచి చేరికలు సందర్భంగా మాట్లాడిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

కాకినాడ ఎంపీ గా జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్

Image

పిఠాపురం ఎమ్మెల్యే సీటు తన కోసం త్యాగం చేసిన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారి నీ కాకినాడ ఎంపీ గా పవన్ కళ్యాణ్ ప్రకటించారు . టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తరుపున కాకినాడ నుంచి ఎంపీ గా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయనున్నారు ..

Live: పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పిఠాపురం జనసేన పార్టీ లో చేరికలు

Image

పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పిఠాపురం జనసేన పార్టీ లో చేరికలు Live https://www.youtube.com/live/GoZ251djbWU?si=WqY3SRf-_3WLlGaq

గ్లాస్ అంటే కనిపించని సైన్యం

Image

పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజ్ చేసిన blaze లో పవర్ ఫుల్ డైలాగ్ కనిపించాయి . గాజు పగిలేకొద్ది పదునెక్కుతుంది కచ్చితంగా గుర్తు పెట్టుకో గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం కనిపించని సైన్యం

నమ్మిన నాయకులను మోసం చేసిన చరిత్ర పిఠాపురం ప్రజలకు లేదు

Image

నాయకులను మోసం చేసిన చరిత్ర పిఠాపురం ప్రజలకు లేదు పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉన్నది నియోజకవర్గంలో గెల్చిన పార్టీ అధికారంలో కి రాదని కానీ దీనికి వెనుక ఉన్న నిజం మాత్రం వేరు .. పిఠాపురం ప్రజలకు నమ్ముకున్న నాయకులను మోసం చేయడం రాకపోవడం ,ఓట్లు అమ్ముకునే నైజం అసలే లేదు , నమ్మితే నిలబడే వ్యక్తిత్వం కలిగి ఉండడం ఇక్కడ ప్రజల సొంతం . రాష్ట్రంలో గాలి ఎటువున్న నియోజవర్గం లో ప్రజలు మాత్రం తమ అనుకున్న నాయకులని మాత్రం గెలిపిస్తారు .. చరిత్ర చూస్తే ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్ అని ప్రచారం చేసిన సంగిశెట్టి వీరభద్ర రావు కి అండగా నిలిచారు .. 2009 లో గాలి మొత్తం కాంగ్రెస్ వైపు ఉంటే మార్పు కోసం వచ్చిన ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచారు 2014 లో ఇదే బీజేపీ,జనసేన,టీడీపీ కూటమి లో వర్మ కి టిక్కెట్ రాకుండా పోతుల విశ్వం కి టీడీపీ తరుపున టిక్కెట్ వస్తే అయ్యే పాపం మన వర్మ కి అన్యాయం జరిగింది అంటూ రాష్ట్రం మొత్తం గాలి కూటమి వైపు ఉంటే వర్మ కి అండగా నిలిచారు .. ఎలక్షన్స్ కి అతి కొద్ది రోజుల ముందు వచ్చిన జనసేన శేషు కుమారి గారిని కూడా ఆదరించే ప్రయత్నం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంతు నిజాయితి గల ప్రజా నాయకుడు కి పిఠాపురం ప్రజలు మరోసారి అండగా నిలిచి చరిత్ర సష్టించే అవకాశం ఉన్నదని సర్వేలన్నీ పిఠాపురం ప్రజలు పవన్ తోనే అని చెబుతున్నాయి..

మోదీ గారి తో పవన్ కళ్యాణ్ గారు

Image

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంభాషణ. ఎన్నికల సన్నద్దత, రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారు

గెలుపే లక్ష్యంగా సమాయత్తం అవ్వండి-శ్రీ k. నాగబాబు

Image

గెలుపే లక్ష్యంగా సమాయత్తం అవ్వండి . జనసేన నాయకులతో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి బీజేపీ కూటమి అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు జనసేన నాయకులకి సూచించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నాయకులు శ్రీ నాగబాబు గారితో భేటీ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోటీకి అవసరమైన ఏర్పాట్లు, ప్రచార కార్యక్రమాల ప్రణాళికలు ముమ్మరం చేయాలని అన్నారు. ప్రచారం కోసం రావాలని నాయకులు శ్రీ నాగబాబు గారిని కోరగా, తప్పనిసరిగా పాల్గొంటానని చెప్పారు. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు పొత్తు ధర్మంలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ అభ్యర్ధులు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. పొత్తులో భాగంగా పలువురు నాయకులకు సీట్లు సర్దుబాటు చేయలేకపోయారని... విశాల దృక్పథంతో ఆలోచన చేసి కూటమి విజయంలో భాగస్వాములు కావాలని కోరారు. పార్టీ కోసం నిలిచిన వారికి కూటమి ప్రభత్వంలో తగిన గౌరవం, గుర్తింపు ఇస్తారన్నారు.

గెలుపే లక్ష్యంగా సమాయత్తం అవ్వండి

Image

గెలుపే లక్ష్యంగా సమాయత్తం అవ్వండి జనసేన నాయకులతో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు

పిఠాపురం జనసేనపార్టీ శ్రేణులకు ముఖ్య గమనిక

Image

పిఠాపురం నియోజకవర్గ జనసేనపార్టీ బూత్ కమిటీ సభ్యలకు సంబంధించి మంగళగిరి జనసేనపార్టీ కార్యాలయం వద్ద జరగవలసిన మీటింగ్ తాత్కాలికంగా రద్దు చేయబడింది. రద్దు చేయబడిన మీటింగ్ జరుగు వివరాలు త్వరలో మీకు తెలియపరచడం జరుగుతుంది. జనసేనపార్టీ కార్యాలయం పిఠాపురం

JspPtp యాప్ గురించి

Image

సత్యం పవనిజం - ఒక నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా వంతుగా ఆయన అడుగులో మనది ఒక చిన్న అడుగు కావాలనే ఉద్దేశంతో ఈ యాప్ నీ రూపొందించడం జరిగంది నిమిషాల వ్యవధిలో మీ ముందు జనసేన పిఠాపురం నియోజకవర్గ వార్తలు మరియు కార్యక్రమాలు చేరవేయాలని ఈ యాప్ ను రూపొందించడం జరిగింది డేటా ప్రేవైసీ కి పెద్ద పీట వేస్తున్నా అధినాయకుడు కి ఆలోచనకి అనుగుణంగా ఈ యాప్ లో ఎటువంటి వ్యక్తిగత సమాచారం సేకరిచడం లేదు .. మీ పేరు ,ఫోన్ నంబర్ లాంటి వ్యక్తిగత సమాచారం లేకుండా కేవలం ఒక notification తో మీ ముందుకు పిఠాపురం జనసేన వార్తలు చేరవడం జరుగుతుంది .. డేటా ప్రేవేసి ఉంది కనుక ఎటువంటి వారైనా నిర్భయంగా మా యాప్ నీ ఉపయోగించుకోవచ్చు .మీరు గానీ మీ వివరాలు కానీ తెలిసే ప్రసక్తే లేదు "మాట చేరలేని చోట పాదం కదలులేని చోట అక్షరం మాత్రమే మార్పు తీసుకువస్తునదని భావించే వ్యక్తులుగా మీ ముందుకు JspPtp. ." నాడు Easydelivers తో కరోన సమయంలో మీ ముందుకు వచ్చిన మేము ఈరోజు నిస్వార్థ నాయకుడికి ఉడత సహాయంగా JspPtp .. Note: జనసేన పార్టీ అభ్యర్థులకు Digital Media పరంగా ఎటువంటి సహాయం కావాలన్న contact :Srsoftcodes@gmail.com Thanks & Regards -SrSoftcodes Srsoftcodes@gmail.com

ఈసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దాం

Image

మన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎందరికో అసెంబ్లీ కి వెళ్ళే అవకాశం కల్పించిన ఓటర్లు ఈ సారి నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి అసెంబ్లీలో పిఠాపురం నియోజవర్గం పేరు మార్మోగేటట్లు చేద్దాం .. ఒక నిజాయితీ గళం అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎట్లా ఉంటదో ఈ రాష్ట్రంలో చూపిద్దాం

An error has occurred. This application may no longer respond until reloaded. Reload 🗙