నాయకులను మోసం చేసిన చరిత్ర పిఠాపురం ప్రజలకు లేదు పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉన్నది నియోజకవర్గంలో గెల్చిన పార్టీ అధికారంలో కి రాదని కానీ దీనికి వెనుక ఉన్న నిజం మాత్రం వేరు .. పిఠాపురం ప్రజలకు నమ్ముకున్న నాయకులను మోసం చేయడం రాకపోవడం ,ఓట్లు అమ్ముకునే నైజం అసలే లేదు , నమ్మితే నిలబడే వ్యక్తిత్వం కలిగి ఉండడం ఇక్కడ ప్రజల సొంతం . రాష్ట్రంలో గాలి ఎటువున్న నియోజవర్గం లో ప్రజలు మాత్రం తమ అనుకున్న నాయకులని మాత్రం గెలిపిస్తారు .. చరిత్ర చూస్తే ఇదే నా లాస్ట్ ఎలక్షన్స్ అని ప్రచారం చేసిన సంగిశెట్టి వీరభద్ర రావు కి అండగా నిలిచారు .. 2009 లో గాలి మొత్తం కాంగ్రెస్ వైపు ఉంటే మార్పు కోసం వచ్చిన ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచారు 2014 లో ఇదే బీజేపీ,జనసేన,టీడీపీ కూటమి లో వర్మ కి టిక్కెట్ రాకుండా పోతుల విశ్వం కి టీడీపీ తరుపున టిక్కెట్ వస్తే అయ్యే పాపం మన వర్మ కి అన్యాయం జరిగింది అంటూ రాష్ట్రం మొత్తం గాలి కూటమి వైపు ఉంటే వర్మ కి అండగా నిలిచారు .. ఎలక్షన్స్ కి అతి కొద్ది రోజుల ముందు వచ్చిన జనసేన శేషు కుమారి గారిని కూడా ఆదరించే ప్రయత్నం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వంతు నిజాయితి గల ప్రజా నాయకుడు కి పిఠాపురం ప్రజలు మరోసారి అండగా నిలిచి చరిత్ర సష్టించే అవకాశం ఉన్నదని సర్వేలన్నీ పిఠాపురం ప్రజలు పవన్ తోనే అని చెబుతున్నాయి..